అవని: -:- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 చూడు చూడు మన అవని
ఎంత అందాల రాశి
అవని ఎంత అందమో
చేతికందే స్వర్గమో !! చూడు!!
వడిగ పారు వాగులతో
పైరు పచ్చ పొలములతో
ఉద్యానవనములతో
సుందరమై వెలుగొందే !! చూడు!!
గిరి తరులు మరులుగొలుప
కరి మకరి ఘనతరములు
సకల జంతుజాలముతో
సుందరమై వెలుగొందే !! చూడు!!
ఇలనున్న చెట్టుచేమ
ఇలనున్న పురుగుపుట్ర
ఇలనున్న జంతు పక్షి గణము
సుందరమై వెలుగొందే !! చూడు!!
ఘన జలము నిండినట్టి
సాగర అందాలు గాంచి
నింగి అందాలు చూసి
కొండ కోనల లోనీ
అందాలు తిలకించగ !! చూడు!!