భోగి -మొహమ్మద్. అఫ్సర వలీషా.--ద్వారపూడి (తూ గో జి).

 భోగి....
బాలలూ.....
భోగ భాగ్యాల నిచ్చే 
సంక్రాంతి ముందు వచ్చే 
భోగి గురించి తెలుసు కుందామా...
ముదితల నుండి ముద్దు గారే
 పసి పిల్లల వరకు 
సంతోషాలు నింపు పండుగ 
ముచ్చట గొలిపే మూడునాళ్ళ
 సంక్రాంతి పండుగ....
ముందు నాడు తొలి పండుగ 
భోగ భాగ్యాలు ప్రసాదించే 
భోగి పండుగ.....
దక్షిణాయనంలో
 కష్టాలు ,బాధలు 
భోగి మంటల రూపంలో 
అగ్ని దేవుడికి సమర్పణలు...
ఉత్తరాయణం లో కోరుకునే
 సుఖాలు,సంతోషాలు 
భోగి పండుగ ఆశావాహ
దృక్పథానికి సంకేతాలు....
సూర్య కిరణాలు 
భువిని తాకక ముందే
ఆవు పేడ పిడుకలు
రావి ,మేడి,పంట చెట్ల
అవశేషాలు, తాటాకులతో
భోగి మంటల వెలుగులు....
పనికి రాని చెడు పాత
ఆలోచనలకు స్వస్తి పలుకుదాం
కాలంతో పాటు వచ్చే మంచి 
మనసుల మార్పు కు 
ఆహ్వానపు పలుకులు....
కష్ట దోషాలు తొలగుటకు
నలుగుతో కుంకుడుకాయ స్నానాలు
నూతన ఉత్తేజంకు సోపానాలు ...
పాలుగారే పిల్లలకు రేగుపండ్లతో 
భోగి పళ్ళ స్నానాలు
పీడ, దిష్టి తొలగిపోతాయనే నమ్మకాలు .....
క్రొత్త బియ్యం తో పులగ సంప్రదాయాలు 
జీర్ణ శక్తి ప్రసరణం పోషకాహారాల పరంపరలు.....!
చిన్న పిల్లలు ఆట వస్తువులతో 
బొమ్మల కొలువు ప్రదర్శనాలు
నిష్టతో పాటలు పాడటం 
దేవీ దేవతల ప్రశంశలు ....
భోగిమంటకు హానికారక 
ప్లాస్టిక్ వినియోగాలు
పర్యావరణానికి  బహుచేటు 
హానిరహిత పాత చెక్క
వస్తువినియోగం అన్నింటా బహు మేలు ....
తెలిసిందా బాలలూ.....!!