తెలుసుకోండి మీ గొప్పతనంచెప్పులు లేని మనిషి బలహీనుడుమిట్టమధ్యాహ్నం ఎండలోమండే సూర్యుడి వేడిలోకుతకుతా ఉడికే తారు రోడ్డుపైనడవగలడా మనిషి మీ తోడు లేకుండా?రాళ్ళూ రప్పలతో నిండిన దారుల్లోఅడ్డుదిడ్డమైన రహదారుల్లోమనిషి నడవగలడా నీ తోడు లేకుండా?మీకో ప్రత్యేకత ఉంది తెలుసా...మిమ్మల్ని తయారు చేస్తూతన జీవితాన్ని పటిష్టపరచుకోవడానికిశ్రామికుడు చెమటోట్చడం తెలుసా...చెప్పులారా,మీపై పట్టిన దుమ్మూధూళితోఏవన్నా విషక్రిములు చొచ్చుకొచ్చిజబ్బులూ గట్రా వస్తాయోమేననిభయపడి నిన్ను వాకిట్లోనే విడిచిపెట్టేమనిషి ఒట్టి కృతఘ్నుడనుకో...అంతేతప్పనిన్ను శుభ్రంగా ఉంచాలని ఆలోచించడేంటో...ఎండనకవాననక శ్రమించే మీ గొప్పతనంఎప్పటికి తెలుసుకుంటాడో ఈ మనిషి?చెప్పులూ,మీకు కృతజ్ఞతలుమిమ్మల్ని హీనంగా తలచిచిన్నచూపు చూస్తూమాటలు పారేసుకునే మనిషిని చూడు,వారి హేళనలు పట్టించుకోకుండాస్వార్థమనేది లేకుండానువ్వు వారి అడుగులకు తోడ్పడేనువ్వు నిజంగా గొప్పదానివే...నీకెట్లా కృతజ్ఞతలు చెప్పను...మమ్మల్ని వేర్వేరు చేయొద్దనినువ్వు బతిమాలడమెందుకు....అలా చేస్తే మనిషికే నష్టం...అది తెలీకుంటే వాడి మానాన వాడు పోతాడంతే...ఎప్పటికీ ప్రేమతోమీ పాదాల కింద మేము అనేమీ నిస్వార్థత్వానికిఇదిగో ఇప్పుడే చెప్తున్నా నా కైమోడ్పు
చెప్పులారా: -- యామిజాల జగదీశ్