కొడుకు రమణయ్య శెట్టి సరుకులు కట్టి అందచేస్తున్నాడు.సుబ్బయ్య భార్య తాయారమ్మ మధ్యలో భర్తకు కొడుక్కి టిఫిన్అందచేస్తోంది.సుబ్బయ్య శెట్టి తండ్రి నుంచి వ్యాపార మెలకువలు డబ్బుపొదుపు నేర్చుకుని షాపు పెద్దది చేసి కొత్త సరుకులు తెచ్చివ్యాపారం అభివృద్ధి చేసాడు. అత్యాసకు పోకుండా బీద చిన్నకొనుగోలు దారుల్కి డబ్బులు తక్కువైనా సరుకులు ఇచ్చేవాడు.కొడుకు రమణయ్యకి కూడా తనలాగ వ్యాపార మెలకువలు,కొనుగోలుదారులతో ఎలా వ్యవహరించాలో తెలియచేస్తు పొదుపు చేసిన డబ్బుతో పాత ఇంటిని పడగొట్టి విశాలంగా అధునాతన వసతులతో పెద్ద గృహాన్ని కట్టించాడు.సంవత్సరాలు గడిచి ఆధునిక పోకడలతో ఊళ్లో మార్పులువచ్చాయి. పిల్ల గాళ్లు పట్నాలకు పోయి చదువులు నేర్చుకునిఫేషన్లు తెచ్చుకున్నారు.వేష భాషలు మారిపోయాయి.ఎడ్లబళ్లు ,సైకిల్ రిక్షాలు పోయి ఆటో టెంపోలు, మోటర్ బైకులు రోడ్లమీదపరుగులు పెడుతున్నాయి.ఎక్కడ చూసినా ఆధునికత కనబడుతోంది.కాలగమనంలో సుబ్బయ్య శెట్టి దంపతులు వయసు మీరిముసలివారయారు.ఏకైక వారసుడు రమణయ్యని పెద్ద వ్యాపార వేత్తగా తీర్చిదిద్దాడు.వ్యాపార భాద్యతలు కొడుక్కిఅప్పగించి విశ్రాంతి తీసుకున్నాడు సుబ్బయ్య శెట్టి.కొడుకుషాపును ఆధునిక హంగులతో మెరుగులు దిద్ది వ్యాపారంఅభివృద్ధి చేసి డబ్బు సంపాదిస్తున్నాడు.కొడుకు ఉన్నతినిచూసి మురిసిపోయారు సుబ్బయ్య శెట్టి దంపతులు.భార్య కి వయసు మీరినందున వెనక సాయంతో పాటుమరో ఆడదిక్కు ఉంటుందని తలిచి పట్నం పిల్లని వెదికికొడుక్కి ఘనంగా పెళ్లి జరిపించాడు సుబ్బయ్య శెట్టి.వచ్చిన కోడలు ధనవంతుల ఏకైక కూతురైనందున ఆధునిక అలవాట్లు గారాబంగా పెరిగింది. ముసలి వారైన అత్తమామలపద్దతులు ఆహార వ్యవహారాలు నచ్చేవి కావు. వారిని హేళనచేస్తు సూటీపోటీ మాటలతో బాధ కలిగించేది.వంటగది పడకగది హాలు ఆదునిక వస్తువులతో ఇంటి రూపురేఖలే మార్చేసిందిఇంటి భాద్యత తన చేతిలోకి తీసుకుని వంట ఆహారవిషయాల్లో ఆధునికత తెచ్చింది.పాత సంప్రదాయ పద్దతుల్లో జీవితం గడిపిన సుబ్బయ్య శెట్టిదంపతులు దుర్భర పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. కోడలుఅనరాని మాటలతో అవమాన పరుస్తోంది.వంట వ్యవహారాలు పనివాళ్ల చేత చేయిస్తు సంప్రదాయవంటకాలకు బదులు ఆధునిక బిర్యానీ చపాతీలు మసాలతిళ్లతో భోజనం పెట్టించేది. అవి వారికి ఇష్ఠం ఉండేవి కావు. కొడుకు రమణయ్య శెట్టి పూర్తిగా పెళ్లాం చేతిలో కీలుబొమ్మగామారేడు. ముద్దుల భార్య ఏది చెబితే అదే వినేవాడు.వ్యాపారంబాగా అభివృద్ధి చెంది పనివాళ్లను పెట్టి షాపు నడిపిస్తున్నాడు.ముసలి వారిద్దరికీ పెరటివైపున వంటగది పక్కన స్టోర్ రూము దగ్గర నివాసం ఏర్పరిచారు.వారికి సరైన భోజనం ,బట్టలకు కరువొచ్చింది. వార్దక్యం వల్ల ఇద్దరూ అనారోగ్యంతోబాధ పడుతున్నారు. కంటిచూపు తగ్గింది.తనకి ఆరోగ్యం సహకరించక పోయినా తాయారమ్మ భర్తకితిండి, దినచర్యలో సహాయపడేది.మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు సుబ్బయ్య శెట్టి మానసికంగా కుంగిపోయిపక్షవాతం వచ్చి ఒకపక్క కాలు చెయ్యి పని చెయ్యడం మానేసాయి.తాయారమ్మకు పనిభారం మరింత పెరిగింది.తిండి సదుపాయం లేక దంపతులిద్దరూ ఆర్దాకలితో రోజులువెళ్లదీస్తున్నారు.కొడుకు కోడలు ముసలివాళ్లను లెక్క చెయ్యడం లేదు.వారి ఆరోగ్యాన్ని పట్టించుకోరు. వారి బాగోగులు పనివాళ్లకుఅప్పగించారు.ఇలా సుబ్బయ్య శెట్టికి గడ్డుగా రోజులు గడుస్తుంటే మరొకఎదురు దెబ్బ తగిలింది. అకస్మాత్తుగా భార్య తాయారమ్మగుండెపోటుతో నిద్రలోనే చనిపోయింది. శెట్టి ఏకాకి అయాడు.భార్య బ్రతికున్నంత కాలం వంట్లో శక్తి లేకపోయినా తన అవసరాలు తీర్చేది.ఇప్పుడు ఆ ఆసరా కూడా లేకపోయింది.బ్రతుకు జీవుడా అనుకుంటూ ఇంటి పెరటి వరండాలో దిక్కుమొక్కు లేకుండా పనివాళ్లు తెచ్చి పెట్టే తిండి వంటికి సరిపడకఅర్దాకలితో రోజులు వెళ్లదీస్తున్నాడు. చూపు సరిగా ఆనదు.కాలు చెయ్యి పనిచెయ్యవు.కొడుకు రమణయ్య వ్యాపారకార్యకలాపాల్లో వత్తిడిగా ఉంటూ స్థానికంగా లయన్స్ క్లబ్శెక్రెటరీగా సమాజ సేవలతో ఊపిరి సలపడం లేదు.పనుల వత్తిడితో వీలు చిక్కినప్పుడు వచ్చి తండ్రిని పలకరిస్తాడు.ఒకరోజు అర్థరాత్రి ఇద్దరు దొంగలు శేఠ్ రమణయ్య ఇంట్లోదొంగతనానికి వచ్చారు. వాళ్లు ఇంటి వెనక గోడదూకి వంటగదిపక్కనుంచి వెల్తూంటే ఘుమఘుమ వంటకాల వాసన ముక్కుకితగిలింది.ఆకలి మీదున్న వారు కడుపు మంట చల్లార్చి మిగతాపని తర్వాత చేసుకోవచ్చని పళ్లేల్లో పెట్టుకుని సుబ్బయ్య శెట్టనిఉంచిన స్టోర్ రూము అరుగు మీద కూర్చుని తినడానికి సిద్దపడుతున్నారు." నాయనా! బాగా ఆకలిగా ఉంది. నాకో ముద్ద పెట్టి రక్షించండిదేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు." నీర్సంగా గొంతుక వినబడింది దొంగలిద్దరికీ.ఎవరబ్బా ఈ చీకట్లో ఇక్కడ పడున్నారని వాళ్ల దగ్గరున్నటార్చిలైట్ ఫోకస్ చేసి సుబ్బయ్య శెట్టి పడుకున్న మంచం మీదవేస్తే ముసలాయన అచేతనావస్థలో కనిపించాడు.సుబ్బయ్య శెట్టిని గుర్తు పట్టిన దొంగలు ఆయన దీనావస్థనుచూసి చలించిపోయారు.సుబ్బయ్య శెట్టి వయసులో ఉన్నప్పుడు ఊళ్లో చిన్నగా ఉండే ఈ దొంగ అన్నదమ్ములిద్దరూకిరాణా షాపు కొచ్చి చిరుతిళ్లు కొనుక్కునే వారు. డబ్బులుతక్కువైనా శెట్టి ఉదారంగా సరుకులు ఇచ్చేవాడు.తర్వాతపెద్ద దొంగతనాలకు అలవాటు పడి ఊళ్ల మీద తిరుగుతూఉన్న ఊరికి దూరమయారు.వాళ్లు వంటగది నుంచి తెచ్చుకున్న వంటకాల్లో శెట్టికి కొంతతినిపించారు. సుబ్బయ్య శెట్టి నోటిద్వారా ఆయనఒడుదుడుకుల దుర్భర జీవిత గాధను తెలుసుకుని కోపంతోఊగిపోయి ఇప్పుడే నీ కొడుకు కోడలు అంతు చూస్తామనిలేచారు ఇద్దరూ.ఇంతలో మామగారుండే స్టోర్ రూమ్ వసారా నుంచి మనుషుల మాటలు వినబడుతున్నాయని భార్య నిద్ర లేపగా,రమణయ్య శెట్టికి కూడా మాటలు అస్పష్టంగా వినబడ్డాయి.ఈ అర్థరాత్రి ఎవరు వచ్చి వుంటారో చూద్దామని కిటికీపక్కకు వచ్చి తొంగి చూడగా మసక వెలుగులో ఇద్దరు యువకులు తండ్రి దగ్గర్లో కూర్చుని ఉండగా తండ్రి వారితోఇలా అంటున్నాడు " వద్దు, నాయనలారా ! వాళ్లనేమీ చేయవద్దు. నేను కొడికట్టిన దీపాన్ని. ఎప్పుడు ఆరిపోతానోతెలియదు. నా బ్రతుకు ఇలాగే సాగిపోతుంది. వాళ్లయినాసుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను" అంటూదొంగల్ని వేడుకుంటున్నాడు.దొంగ అన్నదమ్మలిద్దరు ఆయనమాటకు విలువిచ్చి గోడ దూకి వెళిపోయారు.తండ్రి దయార్ద్ర హృదయాన్ని తెలుసుకున్న రమణయ్యశెట్టి ఇంతకాలం కర్కశంగా అమ్మానాన్నల్ని కష్టాలపాలుచేసినందుకు కనువిప్పు కల్గింది.తిరిగి పడక గదికి చేరి, దొంగలకీ తండ్రికి జరిగిన సంభాషణ విషయం భార్యకి వివరంగా చెప్పి , దొంగల్ని మనకేమీ ప్రాణహానితలపెట్టొద్దని తండ్రి వేడుకోవడం తెలియ చేసాడు.కోడలు కూడా మామగారి మంచితనాన్ని తెలుసుకునిస్టోర్ రూమ్ నుంచి తెచ్చి ఇంట్లోనే అన్ని సౌకర్యాలు కల్పిచి తండ్రిలా ఆదరాభిమానాలు కనబరుస్తోంది.కొడుకు కోడలు తన పట్ల ఇంత ప్రేమాభిమానాలు చూపడంవారిలో ఇంత మార్పు ఎలా వచ్చిందో తెలియక పోయినా వారిఆదరాభిమానాలకు ఆనందభరితుడయాడు సుబ్బయ్య శెట్టి.* * *
పరివర్తన ; --కందర్ప మూర్తి , కుకట్ పల్లి , హైదరాబాదు.