1.పోషకాహారలోపమేశాపం.
దృష్టిదోషం తప్పదు
చిన్నతనం నుండే.
2.టీ.వీ.లు,సెల్ ఫోన్లు
వ్యసనాలాయె.
బాల్యం నుంచే
సులోచనాలాయె.
3.పచ్చని కూరగాయలు
అమృతాలు.
శైశవదశ నుండే
చేస్తాయి మేలు.
4.పొనగంటికూర
ప్రత్యేకం.
పచ్చగుమ్మడికాయ,
క్యారెట్లు సంజీవాలు.
5.పచ్చని ప్రకృతి
చేస్తుంది మేలు.
నయనాలకు
విశ్రాంతి చేకూరు.
6.గారాబం
హ్రస్వదృష్టికి కారణం.
వీడియోగేమ్స్
కంటికి హానికారకాలు.
7.మంచి అలవాట్లే
మాత్రలు.
లోచనాలకవే
సర్వరక్షణలు.
బాల్య లోచనాలు(నానీలు)--డా.రామక కృష్ణమూర్తి--బోయినపల్లి,సికింద్రాబాద్.