ఎన్ని భాషలు నేర్చినా తెలుగంటే ప్రాణమనీ
తెలంగాణా యాస మక్కువనీ తెల్పినావు
నిజాం పాలకులపై కవితా బాణాలు ఎక్కుపెట్టినావు
"నా గొడవ " అంటూ జనాల గోడు వినిపించినావు
అమ్మ భాషను గౌరవించమనీ
అన్య భాషలు నేర్చుకొమ్మని తెల్పినావు
బడిపలుకుల భాష కాదు
పలుకుబడుల భాష కావలన్నావు
అన్య భాషలు నేర్చి ఆంధ్రము రాదన్నవాణ్ణి
చావవెందుకురా అంటూ మందలించావు
కాకతీయ విశ్వవిద్యాలయ డాక్టరేటు పొందినావు
సామాన్యుడే నా దేవుడు అంటూ
ప్రజా హక్కుల రక్షణకై పోరాడినావు
ప్రజకవిగా పేరొందిన పద్మ విభూషణా
జనుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన
కాళన్నా నీకు జోహార్లు.
కాళన్నా నీకు జోహార్లు: -వేముల ప్రేమలత--హైదరాబాద్