ఇష్టం ...!!: -------డా.కె .ఎల్వీ .హనంకొండ .

 సంక్రాంతి 
అంటే నాకెంతో 
ఇష్టం ....
ముంగిట వేసే 
ముగ్గులు ....
వల్లమాలిన ఇష్టం !
మిద్దెమీద 
పంతంగులు 
(గాలిపటాలు) 
ఎగరెయ్యడం 
నాకెంతొ ఇష్టం !
సంక్రాంతి సమయంలో 
హరిదాసుల 
సంకీర్తనం ఇష్టం ,
డూ ..డూ ..బసవన్న 
రాగాలతో -
గంగిరెద్దుల విన్యాసాలు 
మరీమరీ ఇష్టం .....!
బోగిరోజు పుట్టిన 
మా తాతయ్య 
చిన్ననాటి కథలంటే 
మహా ఇష్టం ....!
మా ..పూర్వీకులు 
నివశించిన -
' దిండి గ్రామం ' లో ,
సంక్రాంతి సంబరాలు 
చూడ లేకపోవడం ,
నా ..దురదృష్టం ...!!
       ------------------------
ఫొటోలో...:ముగ్గుల ప్రాక్టీసులోబేబీ..ఆన్షి.నల్లి.