నమోనమో: - :- డా.గౌరవరాజు సతీష్ కుమార్


 తల్లిభారతికి నమోనమో

శారదాంబకు నమోనమో

మాటలు నేర్పిన మాటలతల్లి

పాటలు నేర్పిన పాటలతల్లి

ఆటలు నేర్పిన ఆటలతల్లి

బుధ్ధులు నేర్పిన బుధ్ధులతల్లి

సుద్దులు నేర్పిన సుద్దులతల్లి

చదువులు నేర్పిన చదువులతల్లి

జ్ఞానము ఇచ్చిన జ్ఞానదాయిని

తల్లిభారతికి నమోనమో

శారదాంబకు నమోనమో !!