ఏకపది:(కడలి)*******
1.లోతెంతో తెలియక_విశాలమైన గంభీర జలధి.
2.రహస్య సంపదలెన్నింటినో_తనలో దాచుకున్న ఉదధి.
ద్విపదం:(ముత్యం)
********
1.స్వాతిచినుకులను తనలో ఇముడ్చుకొన్నది.
ఆల్చిప్పల్లో దాగి అందమై వెలిగేది.
2.అతివల గళసీమలో తళుక్కున మెరిసేది.
తెల్లని సంపదై మనసు దోచేది.
త్రిపదం:(చినుకు)
******
1.మేఘం హర్షించి ప్రసవించే అమృతం.
ఆకాశం దాచుకొనే మబ్బుల సంతోషం.
నీరు ఆవిరై జీమూతం కురిపించే వర్షానికి సంకేతం.
2.వానలోని అంశతో మిళితమైన చిట్టి నీటి ఆనందం.
చుక్క రూపు వానలోని స్వల్ప
సమ్మిశ్రమం.
మేఘ ఆనంద బాష్పమై అవనిని ముద్దాడు చుంబనం.
చతుర్థపదం:(ఆధిపత్యం)
***********
1.సమస్తాన్ని నియంత్రించాలనే దృక్పథం.
మాట నెగ్గించుకొనే మహామంత్రం.
ఆక్రమించి,శాసించే నియంతృత్వం.
ఆధీనంలోకి తెచ్చుకొని నెరిపే మంత్రాంగం.
2.అధికారం చలాయించేందుకు మార్గం.
బలంతో బలహీనంపై పొందే పైచేయి.
మానసిక,శారీరక,ప్రాకృతిక గుత్తాధిపత్యం.
అధికమనే భావనతో చేసే పెత్తనం.
అక్షరమాలికలు: --డా.రామక కృష్ణమూర్తి--బోయినపల్లి,సికింద్రాబాద్.