స్వామి వివేకానంద--ఆణిముత్యాలు కొన్ని: - సేకరణ : జగదీశ్ యామిజాల
 1
పువ్వులై ఉండిపోకు
రాలిపోతావు
చెట్లై ఉండు
అప్పుడే పూస్తూ ఉంటావు
2
నువ్వు ఏదైతే అనుకుంటావో
అలాగే అయిపోతావు
శక్తిమంతుడని అనుకుంటే
బలవంతుడవవుతావు
3
సత్యం కోసం
దేన్నయినా త్యాగం చేయొచ్చు
కానీ
ఆరునూరైనా సత్యాన్ని
త్యాగం చేయకూడదు
4
ఒట్టి బలంతో కాకుండా
ఆధ్యాత్మిక శక్తితో
ముందడుగు వేయాలి
అనుకున్నది సాధించాలి 
5
ప్రపంచంలోని లోపాల గురించి మాట్లాడకూడదు
లోపాలను చూసి బాధపడు
ప్రపంచాన్ని నిందించకు
లోపాలను పదే పదే చెప్పి
ప్రపంచాన్ని మరింత బలహీనపరచకు
ప్రపంచ లోపాలు నేరాలు అన్నీనూ
బలహీనతల వల్ల వచ్చినవే
6
లేదని చెప్పకు
నా వల్ల అవదు అని ఒక్కసారీ చెప్పకు
ఎందుకంటే నువ్వు శక్తిమంతుడవని
తెలుసుకో.
7
ఉత్సాహంతోనే
అనుకున్న కార్యాన్ని
ప్రారంభించడమే 
విజయవంతమైన జీవితానికి
కావలసిన తొలి మెట్టవుతుంది
8
నీ భవిష్యత్ కాలాన్ని
నువ్వే కల్పించుకో
అప్పటికే జరిగిపోయిన 
దాని గురించి
ఆలోచిస్తూ బాధ పడి 
చతికిలపడకు...
అంతులేని భవిష్యత్తు 
నీ ముందు ఉందన్నది గుర్తుంచుకో!
9
నేను 
ఏదైనా చెయ్యగల సమర్థుడనే 
అని అనుకో
దృఢ నిశ్చయంతో ఉంటే
పాము విషం కూడా 
ఏమీ చెయ్యలేదు