ఆడపిల్ల: -సత్యవాణి


 ఆడపిల్లను నేను

అబలగా పెరుగను నేను

అడుగులేయడం నేర్చినప్పటినుండి

తడబడను నేను

నేలపడబోను నేను

ఆత్మ స్థైర్యం నా ఆయుధం

ఆత్మాభిమానం 

నాకు ఆభరణం

అనుకొన్నది 

సాధించగల పట్టుదల

అలవరచుకొంటాను

గురి ఏర్పచుకొంటాను

గుట్టుగా సాధించుకొంటాను

అందలం ఎక్కడంనుండి

అంతరిక్ష గుట్టు విప్పడం వరకు

అగాధాలు శోధించడంనుండి

అంతరిక్ష నౌకలను నడపడం వరకు

అన్నీ అన్నీ నాకు

నల్లేరుపై నడకే

పని ఏదైనా

కష్టమనుకోను నేను

ఇష్టతో సాధిస్తాను

ఆడపిల్లను నేను

అబలను కాదు నేను

సబలను

మహా బలను


           

కామెంట్‌లు