మన పాపాయి (బాల గేయం ):---.యం. వి. ఉమాదేవి నెల్లూరు.


 పాల బుగ్గల పాపాయి 

పండు చెండు నీకేనోయ్ 

వేల చుక్కల ఆకాశం 

నీ కోసమే వెలిగిందోయ్ !


తప్పటడుగుల తమ్మాయి 

అల్లరి గంతుల తువ్వాయి 

చీపురుపట్టి అమ్మకులాగా 

వాకిలి చిమ్మే గడుగ్గాయి!


అక్షరదీపము నువ్వమ్మా 

లక్షణం గా చదువమ్మా 

చిక్కులులేని బ్రతుకుకోసమే 

చక్కని చదువుల నీవమ్మా !


ఎక్కడ ఉంది స్వాత్రంత్రమ్? 

కట్టు బాట్లుతో ఆటంకం !

దిక్కులు చేరే నినాదమయ్యి, 

ధిక్కారంతో నీ విజయం !


కామెంట్‌లు