నేను - నా నేస్తం: --డా. కందేపి రాణి ప్రసాద్

నేను నేను ఎదో తరగతి చదవడానికి చీరాల వచ్చాను కస్తూరి బా బాలికల పాఠశాలలో చేరాను మేము వేరే ఏ ఊరు నుంచి రావటంతో ఇల్లు దొరికేదాకా మా పెద్దమ్మ వాళ్ళింట్లో ఉన్నాము ఆ ఇల్లు పెరలలో ఉండేది 2 నెలల తర్వాత స్కూలుకు దగ్గర్లో ఇల్లు అద్దెకు తీసుకున్నారు నాన్నగారు కొత్త ఇల్లు తెల్ల గాంధీ బొమ్మ దగ్గర ఉండేది ఇదో విచిత్రం ఎందుకు పెట్టారో ఏమో గాని ఈ చిరాల్లో తెల్ల గాంధీ నీ బొమ్మ నల్ల గాంధీ బొమ్మ అని 2 సెంటర్లలో 2 విగ్రహాలు ఉండేవి ఆయా ప్రాంతాలు తెల్ల గాంధీ బొమ్మ నల్ల గాంధీ బొమ్మ అనే పేర్లతోనే ప్రసిద్ధి చెందాయి ఈ తెల్ల గాంధీ బొమ్మ జీవితంలో నాకు నేస్తాన్ని ఇచ్చింది పేరాలలో ఉన్న రెండు నెలలు మా మా అన్నలు నన్ను స్కూలు దగ్గర దింపి వెళ్లేవారు ఇక్కడికొచ్చాక రెండు రోజులు మా పెద్దమ్మ దింపింది తర్వాత నువ్వే రావాలని చెప్పింది


         ఈ  కొత్త స్కూల్లో నన్ను మొదట్లో e సెక్షన్లో వేశారు తర్వాత సెక్షన్లన్ని మార్చి చివరకు బి సెక్షన్లో వేసి  ఆపేశారు బి సెక్షాన్లో కొద్ది రోజులు ఎక్కడ అ ఖాళీ ఉంటే అక్కడ అ కూర్చున్నాం ఆ  తర్వాత ఒక రోజు క్లాస్ టీచర్ గారు మీ హైట్ వారిగా కూర్చోబెడతాను అన్ని అన్ని పొట్టి వాళ్లను ముందుకు రమ్మన్నారు పొడుగు వాళ్లను వెనక బెంచిల్లో కూర్చోబెట్టారు పొట్టి వాళ్ల లైనులో మంది వచ్చారు అందులో నేను ఉన్నారు రెండు లైన్లలో ఉన్న రెండు మొదటి బెంచీల్లో ఐదుగురు కూర్చున్నారు ఇటువైపు బెంచీ కొచ్చేసరికి ఆరుగురం అయ్యాం ఈ బెంచికి ఈ చివర  నేను కూర్చున్నాను ఆరుగురం అయ్యేసరికి కొద్దిగా ఇరుగ్గా ఉంది అది బెంచికీ ఆ చివర ఉన్న అమ్మాయి కి నచ్చలేదు వెంటనే ఆ అమ్మాయి లేచి నన్ను వెనక బెంచీ లోకి వెళ్లి కూర్చో ఇక్కడ ఐదుగురు సరిపొయారు అన్నది నేనేమో టీచర్ గారు మనల్ని మొదటి బెంచీ లోనే కూర్చోమన్నారు కదా వెనక బెంచీ కి వెళితే ఆవిడ  కోప్పడతారు అన్నాను అలా కొద్దిసేపు వాదా ప్రతి వాదనలు జరిగాయి అంతలో ఇంకొక సన్నగా పొడుగ్గా ఉన్న అమ్మాయి వచ్చే నాకు సపోర్టుగా నిలిచింది దాంతో నేను మొదటి బెంచి లోనే కూర్చుండిపోయాను ఆరోజు ఇంటి బెల్లు కొట్టక నేను స్కూలు బయటకొచ్చి కొత్తింటి దారి పట్టాను ఇందాక కూర్చునే ఈ విషయంలో నాతో తగాదా పడ్డా అమ్మాయి కూడా అదే దారిలో పోతున్నది నన్ను చూసి ఆగి పలకరించింది ఇటు వస్తున్నవేంటి అడిగిందా అమ్మాయి  మా ఇల్లు ఇటువైపే తెల్ల గాంధీ బొమ్మ దగ్గర మా ఇల్లు చెప్పాను నేను మరి  రోజు వేరే వైపు వెళతావు కదా ఇంకా అనుమానంగానే ఉంది అడిగింది రెండు రోజులైంది ఈ ఇంట్లో చేరి అన్నాను

     
      అలా ఇద్దరం మాట్లాడుకుంటూ వెళ్తున్నాం ముందుగా మా ఇల్లు వస్తుంది ఇదే మా ఇల్లు అని చెప్పాను చూసింది మా ఇంట్లోకి వచ్చింది కాసేపు కూర్చుని వాళ్ళింటికి తీసుకెళ్ళింది మరో రెండిళ్ళ అవతలే వాళ్ళిల్లు నేను వాళ్ళింటికి కాసేపు కూర్చుని ఇంటికి వచ్చాను ఇళ్ళ పెరట్లో నుంచి ఇద్దరం చూసుకోవచ్చు మాట్లాడుకోవచ్చు అలా అలా మొదలైన స్నేహం మా పెళ్లిల్లై మా పిల్లల పెళ్లిళ్ల దాకా సాగుతూనే ఉన్నది ఇప్పటికీ నలభై ఏళ్ల  నుంచి స్నేహ మాధుర్యం పారుతూనే ఉన్నది