బుడమ కాయలు - ఔషధంగా...:-- పి .కమలాకర్ రావు

 బుడమ కాయ చెట్టు ఒక తీగ జాతి మొక్క. ఇవి జొన్న మొక్కజొన్న చేను లో వాటంతటవే పడి మొలుస్తాయి. కాయ చాలా చిన్నదిగా ఉండి ఆకుపచ్చని మచ్చలు కలిగి ఉంటాయి.  పచ్చి కాయ కొద్ది చేదుగా ఉంటుంది. పండిన తర్వాత పుల్లగా ఉంటుంది. బుడమ కాయలతో పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. ఇది రక్తంలోని చక్కెరను మరియు కొలెస్ట్రాల్ ను కూడా తగ్గిస్తుంది.
 బుడమకాయ సూపు ఆరోగ్యానికి మంచిది. ఒక గిన్నెలో నువ్వులనూనె వేసి, జీలకర్ర వెల్లుల్లి ఉల్లి వేసి పోపు చేసి బుడమ కాయలను ముక్కలుగా కోసి, కొద్దిగా పసుపు వేసి నీరు పోసి మరిగించాలి. తగినంత సైంధవ లవణం కలపాలి. దీని  సూప్ తాగడానికి రుచిగా ఉంటుంది, మంచి ఆరోగ్యాన్నిస్తుంది. బుడమ కాయ ముక్కలను కొబ్బరి నూనెలో వేసి తై లంగా కాచి తలకు రాసుకుంటే జుట్టు రాలకుండా కాపాడుతుంది.బుడమకాయ ముక్కలను పుల్లని మజ్జిగలో వేసి ఎండబెట్టి పరుగులుగా చేసి తింటారు