పనస పండు ( Jack fruit)ప్రయోజనాలు, పి . కమలాకర్ రావు .


 మనకు దొరికే అన్ని పళ్ళ కన్నా పనస పండు చాలా పెద్దది. పండు తో పాటుగా దీని ఆకులు, లేత కాయ లోపలి భాగం, పండు లోపలి గింజలు అన్నీ కూడా ఔషధంగా పనికొస్తాయి. ఇందులో మెగ్నీషియం పొటాషియమ్ ఎక్కువ పాళ్లలో ఉంటుంది. అందువల్ల రక్తపోటు పెరగకుండా కాపాడుతుంది. పీచు పదార్థం కూడా చాలా ఎక్కువ అందువల్ల మలబద్ధకం రాకుండా కాపాడుతుంది.చిన్న పిల్లలకు మరియు పెద్దవారికి ఇది మంచి శక్తినిచ్చే ఆహారం. శుభకార్యాలలో పనసపొట్టు వంటకం చాలా ప్రసిద్ధిగాంచింది. లేత కాయ తింటే మేధస్సును వృద్ధిచేస్తుంది  పండిన పనస లో లోపల తోనలు తోనలు గా పళ్ళు  ఉంటాయి. విపరీతమైన సువాసన కలిగి ఉంటాయి. ఇది మంచి రుచికరమైన తీయని పండు.

 పనసపొట్టు తో సూప్ తయారీ విధానం.

 లేత పనసకాయ ను చిన్న చిన్న ముక్కలుగా తరిగి నేతి పోపు లేదా నువ్వుల నూనె పోపు వేసి వెల్లుల్లి ముక్కలు కరివేపాకు వేసి నీరు పోసి మరిగించాలి. మరుగుతున్నప్పుడు కొద్దిగా మిరియాల పొడి. చిటికెడు దాల్చిన చెక్క పొడి వేసి తగినంత ఉప్పు కలిపి  గోరు వెచ్చగా ఉన్నప్పుడుత్రాగాలి ఇది ఎముకలకు మంచి బలం ఇస్తుంది. ఆస్టియోపోరోసిస్ వ్యాధి రాకుండా కాపాడుతుంది. ఎముకలు విరగడం ఉండా కూడా కాపాడుతుంది.