ట్యూన్ అంటే శృతి చేసుకోవడం అని ఇక్కడ అర్ధం చేసుకోవాలి!సంగీత సభలో గాయకులు వాద్యకారులు పరస్పరం తమ తమ గాత్రాలను వాద్యాలను సమానంగా సరిచేసుకునిఓ రాగమో ఓ పాటనో ,దానికి అనుగుణంగా సిద్దం అవుతారు!అలా సిద్దం కాకపోతే, అలా తమను తాము శృతి చేసుకోకపోతే,ట్యూన్ చేసుకోకపోతే,సంగీత సభ రక్తి కట్టదు- గాయకులు ఒక రేంజ్ లోకి వెళితే , వాద్యకారులు ఎవరి రేంజ్ ల్లోకి వాళ్లు వెళ్తే,ఆ సంగీతం కర్ణకఠోరంగా ఉంటుంది! అంటే వినలేక చెవులు మూసుకోవలసి ఉంటుంది! సంగీత సభ గందరగోళంగా ఉంటుంది!అందుకే ముందుగా శృతి చేసుకుంటారు- ట్యూన్ చేసుకుంటారు!తమ తమ తత్వాలను మనస్తత్వాలను కాసేపు పక్కకు పెట్టుకుంటారు- ఒకే లక్ష్యసాధన కోసం ఒక సామూహిక మూర్తిమత్వాన్ని సాధించడానికి ,తమకు తాము ఏకాత్మలాగా ఏక శరీరం లాగా కాసేపు మారతారు;అనుకున్న ఉమ్మడి లక్ష్యాన్ని విజయవంతంగా పూర్తి చేస్తారు! తరువాత ఎవరి వ్యక్తిత్వం వారిదే!మనుషుల మధ్య సంబంధాల విషయంలో కూడా ఇంటా బయటా , విద్యా ఉద్యోగ వ్యాపార రంగాలలో ఎక్కడైనా సరే , ఆయా రంగాలలో ఉన్న సాటి మనుషులతో శృతి చేసుకోవలసి ఉంటుంది- ట్యూన్ చేసుకోవలసి ఉంటుంది!లేకపోతే మానవ సంబంధాలు సజావుగా సాగవు!ఉమ్మడి కార్యక్రమాలు ఏవీ లక్ష్యాలను సాధించవు!విఫలం అవుతారు!దైనందిన జీవితంలో మనిషి అనేక మందితో కలిసి మెలిసి మాట్లాడవలసి ఉంటుంది, పనులు చెయ్యవలసి ఉంటుంది! అవతలి వైపున ఉన్న మనిషి ఎవరు ఏమిటిఅతని మనస్తత్వం ఎలాంటిది? తత్వం ఏమిటి? ఆ మనిషి మనం చెయ్యవలసి వచ్చే పని ఏమిటి? మనం అటువైపు మనిషితో ఎంత మేరకు పరిమితం కావాలి? ఎవరి రేంజ్ ఏమిటో తెలుసుకోవాలి- తగ్గవలసిన చోట తగ్గాలి,పెరగ వలసిన చోట పెరగాలి- సామూహిక వ్యవహారాలలో మనం ఎవరినీ డామినేట్ చెయ్యకూడదు- చెయ్యనివ్వకూడదు- బ్యాలెన్స్ మెయింటేన్ చెయ్యాలి!కొన్ని కొన్ని చోట్ల దర్శకులు ఉంటారు,నాయకులు ఉంటారు,మేనేజర్లు ఆర్గనైజర్లు వగైరా ఉంటారు,వారు అందరినీ ట్యూన్ చేస్తుంటారు! కానీ, జీవితంలో చాలా చోట్ల అటువంటి వారు ఉండరు,మనల్ని మనమే ఎప్పటికప్పుడు చుట్టూ ఉన్న మనుషులతో ట్యూన్ చేసుకోవాలి- అవ్వాలి!ఇళ్లల్లో పెద్దలు ఉంటారు,వారు కుటుంబాలను ట్యూన్ చేస్తుంటారు!క్యాలికులేటెడ్ గా అంచనా వేసుకోవాలి- అవతలి మనిషితో డిస్కస్ చెయ్యాలి- పద్దతి పరిమితి నిర్ణయం తీసుకోవాలి! ఎవరి పరిధులు ఎంతో తెలుసుకోవాలి!మనిషి మరో మనిషితో కలవబోయినప్పుడు,అవతలి మనిషిని గమనించాలి! ఆధునిక మనిషిది అనేక సంక్లితలవ్యక్తిత్వం! పాత సమాజాలలో ఉన్నట్టు సాఫ్ సీదా మనుషులు కారు! జాగ్రత్తగా వ్యవహారం నడపాలి!కొందరు ఎక్కడా ఎవరితో ట్యూన్ అవరు- ఎక్కడా స్థిరంగా ఉండరు- వారు ఒంటరి వారు అవుతారు- అలా కూడా ఉండవచ్చు- అది కూడా గుర్తెరగాలి!అసలే శృతి కుదరకపోతే? ట్యూన్ సాధ్యం కాకపోతే?ఒదిలెయ్యాలి! మళ్ళీ వెదుక్కోవాలి!
గుడ్మార్నింగ్ (137 వ రోజు):-తుమ్మేటి రఘోత్తమరెడ్డి-