శ్రీ కృష్ణ శతకము - పద్యం (౧౯ - 19)

 కందము :
*వారిజనేత్రలు యమునా* *వారిని జలకంబులాడ | వచ్చిన నీ వా*
*చీరలు మ్రుచ్చిలి యిచ్చితి*
*నేరుపురా యదియు నీకు | నీతియె కృష్ణా !* 
తా.: ఓ రుక్మిణీ నాధా, సత్యా వల్లభా, గోపికాలోలా..
గోపికాలోల, తామర పువ్వుల వంటి కన్నులు కలిగిన గోపికలు యమునా నదిలో స్నానము చేయడానికి వచ్చి, నదీతీరంలో వారి బట్టలు వుంచి స్నానానికి నదిలోకి వెళతారు.  అప్పుడు నీవు వారి బట్టలను / చీరలను దొంగిలించావు.  నీ అంతటి వానికి, ఇటువంటి దొంగతనం నీ నేర్పును గానీ, యోగ్యతను గానీ తెలియ పరుస్తుందా? .......అని  శతకకారుడు నృసింహ కవి వాక్కు
 
*కృష్ణా ఆశ్రిత వత్సలా....* అంటూ ఆ నందనందనుని వేడుకొందాము.
.....ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss