*దేవేంద్రుఁడలుక తోడను**వావిరిగా రాళ్ళవాన |వడి గురియింపన్**గోవర్ధనగిరి యెత్తితివి**గోవుల గోపకుల గాచు | కొరకై కృష్ణా !*తా.: ఓ రుక్మిణీ నాధా, సత్యా వల్లభా, గోపికాలోలా..ఓ వెన్నదొంగా, ఒకానొకనాడు దేవేంద్రుడు నందవ్రజముపై చాలా కోపించి, పెద్ద పెద్ద రాళ్ళ తో కూడి, భయంకరమైన శబ్దంతో హోరు హోరున జోరు వాన కురిపించాడు. అప్పుడు, గోవులు, గోపబాలురు, మిగిలిన వారు అలవిమీరిన భయముతో కృష్ణా మమ్మలను రక్షించు అని ప్రాధేయ పడగా, వారిని అందరిని కాపాడడానికి, ప్రక్కనే వున్న గోవర్ధనము అనే పెద్ద కొండను నీ చిటికినవేలి కొనపై పైకెత్తి రక్షించావు.......అని శతకకారుడు నృసింహ కవి వాక్కు*కృష్ణా ఆశ్రిత వత్సలా, గోవర్ధన గిరి ధారి....* అంటూ ఆ నందనందనుని వేడుకొందాము......ఓం నమో వేంకటేశాయNagarajakumar.mvss
శ్రీ కృష్ణ శతకము - పద్యం (౨౦ - 20):