శ్రీ కృష్ణ శతకము - పద్యం (౨౨ - 22)

 కందము :
*అంసాలంబిత కుండల*
*కంసాంతక! నీవు ద్వార | కాపురిలోనన్*
*సంసారిరీతి నుంటివి*
*హంసేంద్ర! విశాలనేత్ర | అచ్యుత కృష్ణా !* 
తా.: ఓ రుక్మిణీ నాధా, సత్యా వల్లభా, గోపికాలోలా..
ఓ వెన్నదొంగా, నీవు విశాలమైన నేత్రములు కలవాడివి, నాశనము లేనివాడివి, యోగులలో శ్రేష్టమైన వాడివి, భుజముల వరకు వేలాడు కుండలములు ధరించిన వాడివి. ఇటువంటి నీవు, గోపకులమైన ద్వారకా పట్టణంలో ఒక మా.మూలు సంసారిలాగా తిరిగావు కదా......అని  శతకకారుడు నృసింహ కవి వాక్కు
 *బలభద్రానుజా, బ్రహ్మాండనాయకా, నీ గురించి తెలుసుకోవడం ఎవరివల్ల అవుతుంది.  యోగులు, యోగీశ్వరులు కూడా తెలుసుకోలేని నిన్ను తెలుసుకోవాలంటే, నీకై నీవే పరిచయం చేసుకోవాలి కానీ అన్యుల వల్ల కాదు కదా.  అనంతా, అచ్యుతా ....* అంటూ ఆ నందనందనుని వేడుకొందాము.
.....ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss