శ్రీ కృష్ణ శతకము - పద్యం (౨౫ - 25)

 కందము :
*హా వాసుదేవ కుమారక*
*కావుము నా మానమనుచు | కామిని వేడన్*
*ఆ వనజాక్షికి నిచ్చితి*
*శ్రీ వర! యక్షయ మటంచు | చీరలు కృష్ణా !* 
తా.: ఓ రుక్మిణీ నాధా, సత్యా వల్లభా, గోపికాలోలా..
ఓ ద్రౌపదీ మాన రక్షకా, కృష్ణా, నీవే దిక్కు, నా మానమును నీవే రక్షించ గలవు,  దయచేసి, కరుణ జూపి నన్ను, నామానాన్ని రక్షించు దేవా, అని వేడుకుంటే, లెక్కకు మిక్కిలి చీరెలు ఇచ్చిన దేవదేవుడివి, నీవు.....అని  శతకకారుడు నృసింహ కవి వాక్కు
 
*జగదానందకారక,  నీట దిగిన మదగజం మొసలి చేత చిక్కి, నా ప్రాణాలు పోతున్నాయి, నీవే నన్ను రక్షించగలిగిన వాడివి. వచ్చి నన్ను కాపాడు. నా ప్రయత్నాలు ఫలితము ఇవ్వటల్లేదు. నిన్నే నమ్మి నీ మీదే భారం పెడుతున్నాను. అని వేడుకుంటే, పరుగు పరుగున వచ్చి రక్షించినవాడు వైకుంఠుడు. "నగుమోము కనలేని నా జాలి తెలిసీ, నను బ్రోవ రాదా...శ్రీ రఘువరా ....* అంటూ ఆ నందకిశోరుని వేడుకొందాము.
.....ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss