శ్రీ కృష్ణ శతకము - పద్యం (౨౭ - 27)

 కందము :
*జయమును విజయున కియ్యవె*
*హయముల ములుకోల మోపి | యదలించి మహా*
*రయమున రొప్పవే తేరును*
*భయమున రిపుసేన విరిగి | పారగ కృష్ణా !* 
తా.: ఓ రుక్మిణీ నాధా, సత్యా వల్లభా, గోపికాలోలా..
ఓ దనుజ సంహారా, పాండవులకు శతృవులైన కౌరవులు యుద్ధములో భయపడి పారిపోయే విధంగా అర్జునుని రధ సారధివై గుర్రాలను పరిగెత్తించి విజయునికి విజయం చే కూర్చావు కదా, రుక్మిణీ నాధా......అని  శతకకారుడు నృసింహ కవి వాక్కు
 
*ఓ దనుజవైరీ, ఆ పన్నులకు ఆలవాలమై వుండేవాడివి నీవే కదా.  మమ్మల్ని  మా పాలనుంచి ఉద్ధరించు స్వామీ...* అంటూ ఆ *నవరస నటనా నాయకుని* వేడుకొందాము.
.....ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss