కందము :*శక్రసుతు గాచుకొరకై*
*చక్రము చేపట్టి భీష్మ | జంపఁగ జను నీ*
*విక్రమ మేమని పొగడుదు*
*నక్రగ్రహ సర్వలోక | నాయక కృష్ణా !*
తా.: ఓ రుక్మిణీ నాధా, సత్యా వల్లభా, గోపికాలోలా..
కురుక్షేత్ర యుద్ధంలో భీష్మార్జునుల మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు, భీష్ముని ధాటికి అర్జునుడు నిలబడలేని పరిస్థితి వచ్చినప్పుడు, అర్జునుని కాపాడాలని నీవు చక్రధారివై భీష్మా పితామహునితో యద్ధం చేస్తావు. అప్పుడు నీవు చూపిన పరాక్రమాన్ని వర్ణించడానికి నాకు సామర్థ్యం లేదు......అని శతకకారుడు నృసింహ కవి వాక్కు
*నీ నామ స్మరణ ఎప్పుడూ మరవని వారిని అహర్నిశమూ కాపు కాస్తానే వుంటావు. "అంతయు నీవే హరి పుండరీకాక్ష, చెంత మాకు నీవే శ్రీ రఘురామా ...* అంటూ ఆ *నవరస నటనా నాయకుని* వేడుకొందాము.
.....ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss
శ్రీ కృష్ణ శతకము - పద్యం (౨౯ - 29)