*దివేంజ్రసుతుని జంపియు**రవిసుతు రక్షించినావు | రఘురాముఁడవై**దివిజేంద్రసుతుని గాచియు**రవిసుతు బరిమార్చితౌర | రణమున కృష్ణా !*తా.: ఓ రుక్మిణీ నాధా, సత్యా వల్లభా, గోపికాలోలా..రామావతారంలో, ఇంద్ర కుమారుడు వాలిని చంపి, సూర్య పుతృడైన సుగ్రీవుని రక్షించావు. కృష్ణావతారంలో ఇంద్ర కుమారుడైన అర్జునుని కాపాడటానికి సూరగయ కుమారుడైన కర్ణుని సంహరింపచేసావు.......అని శతకకారుడు నృసింహ కవి వాక్కు*తెలుగు భాషలో భావ వ్యక్తీకరణ ఎంత అందంగా చేయవచ్చో ఈ పద్యం లో నృసింహ కవి చతురతతో చూపించారు. ఈ పద్యం లో కవితా పటుత్వం చక్కగా పరిచయం అవుతుంది.* *"హరే రామ హారే రామ! రామ రామ రామ హరే హరే!! హరే కృష్ణ హరే కృష్ణ! కృష్ణ కృష్ణ హరే హరే!!" అంటూ ఆ "దివ్య సుందర మూర్తిని"* వేడుకొందాము......ఓం నమో వేంకటేశాయNagarajakumar.mvss
శ్రీ కృష్ణ శతకము - పద్యం (౩౦ - 30)