*దుర్భరబాణము రాఁగా**గర్భములో నుండి యభయ | గావుమటన్నన్**నిర్భరకృప రక్షించితివి**నర్భకు నభిమన్యసుతుని | నచ్యుత కృష్ణా !*తా.: ఓ రుక్మిణీ నాధా, సత్యా వల్లభా, గోపికాలోలా..పాండవ వంశాన్ని "అపాండవం" చేయాలి అనే ధ్యేయంతో అశ్వత్థామ వదిలిన బ్రహ్మాస్త్రం నుంచి, "కావవే వరదా" అని ఉత్తర గర్భములోనున్న పిల్లవాని కొరకు ప్రార్ధించగా అతనిని కూడా కాపాడి, పాండవ వంశాన్ని రక్షించావు......అని శతకకారుడు నృసింహ కవి వాక్కు*మురారీ! ఆర్తితో నిన్ను రక్షించమని వేడిన ప్రాణి ఏదైనా, ఆ క్షణమే రక్షించడం నీ నైజం కదా కరుణా మూర్తీ. "నన్ను బ్రోవ నీ కింత తామసమా! నాపై నేరమేమి, బల్కుమా... "దివ్య సుందర మూర్తిని"* వేడుకొందాము......ఓం నమో వేంకటేశాయNagarajakumar.mvss
శ్రీ కృష్ణ శతకము - పద్యం (౩౧ - 31)