శ్రీ కృష్ణ శతకము - పద్యం (౩౩ - 32)

 కందము :
*గిరులందు మేరువౌదువు*
*సురలందున నింద్రుఁడౌదు | చుక్కలలోనన్*
*బరమాత్మ చంద్రుఁడౌదువు*
*నరులందున నృపతివౌదు | నయముగఁ కృష్ణా !* 
తా.: ఓ రుక్మిణీ నాధా, సత్యా వల్లభా, గోపికాలోలా..
నువ్వే చెప్పినట్లుగా, పర్వతాలలో మేరు పర్వతానివి నీవు. దేవతలలో ఇంద్రుడివి నీవు.  ఆకసంలో చుక్కలలో చంద్రుడివి నీవు.  మనుష్యలలో రాజువి నీవు.  ......అని  శతకకారుడు నృసింహ కవి వాక్కు
 
*మురారీ! "అంతయు నీవే హరి పుండరీకాక్ష! చెంత మాకు నీవే శ్రీ రఘురామా!!" ... అంటూ ఆ "దివ్య సుందర మూర్తిని"* వేడుకొందాము.
.....ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss