శ్రీ కృష్ణ శతకము - పద్యం (౩౩ - 33)

 కందము :
*చుక్కల నెన్నగవచ్చును*
*గ్రక్కున భూరేణువులను | గణుతింపనగున్*
*జొక్కపు నీ గుణజాలము*
*నక్కజమగు లెక్కపెట్ట | నజునకు కృష్ణా !* 
తా.: ఓ రుక్మిణీ నాధా, సత్యా వల్లభా, గోపికాలోలా..
ప్రయత్నం చేసి, ఆకాశంలో వున్న చుక్కలను లెక్క పెట్టవచ్చు.  ఇంకొంచెం కష్ట పడితే, భూమి మీద వున్న మట్టి రేణువులను లెక్క కట్టవచ్చు. కానీ, పరమాత్మా, శ్రీకృష్ణా,  నీ సద్గుణాలను లెక్కించడం, బ్రహ్మ తరం కూడా కాదు కదా.  ......అని  శతకకారుడు నృసింహ కవి వాక్కు.
నీ మహిమలు, గుణములు, పొగిడి నీ కరుణను పొందాలి అనే మా అత్యాశను కూడా తీర్చగలిగే వాడివి, తీర్చే వాడివి నీవే కదా!!! అక్రూర వరదా!!! ... అంటూ ఆ "దివ్య సుందర మూర్తిని"* వేడుకొందాము.
.....ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss