ఇక 6,7,8 తరగతులకు బడి


 తెలంగాణ‌ లో 6,7,8 తరగతుల విద్యార్థులకు బుధ‌వారం నుంచి పాఠ‌శాల‌లు ప్రారంభిస్తున్న‌ట్లు రాష్ట్ర విద్యాశాఖ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ముఖ్య‌మంత్రి కెసిఆర్ ఆదేశాల‌కు అనుగుణంగా త‌ర‌గ‌తులు ప్రారంభించాల‌నే నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు వివ‌రించారు. రేపటి నుంచి మార్చి 1వ తేదీలోగా తరగతులను ప్రారంభించుకోవ‌చ్చ‌ని మంత్రి స్ప‌ష్టం చేశారు. కరోనా నేపథ్యంలో పాఠశాల నిర్వాహకులు కొవిడ్‌ మార్గదర్శకాలు విధిగా పాటించాలని సూచించారు. కాగా విద్యార్థులు పాఠశాలకు విధిగా హాజరుకావాలన్న నిబంధనేది లేదని ప్ర‌భుత్వం స్పం చేసింది. పిల్లలను బ‌డికి పంపేందుకు తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరని మంత్రి తెలిపారు.

ఇప్ప‌టికే పాఠ‌శాల స్థాయిలో 9, 10 త‌ర‌గ‌తిలో పాటు ఇంట‌ర్‌, డిగ్రీ, పిజి కోర్స‌ల్లోని విద్యార్థులంద‌రికీ ఫిబ్ర‌వ‌రి 1 నుండే త‌ర‌గ‌తులు ప్రారంభ‌మైన విష‌యం తెలిసిందే.