బాగున్నది(బాలగేయం ):---ఎం. వి. ఉమాదేవి 7842368534


 ఎరుపూ బాగున్నది 

పసుపూ బాగున్నది 

తోటలోని పువ్వులలో h

తెలుపూ బాగున్నది !


పాటా బాగున్నది 

పద్యం బాగున్నది 

గురువు గారి వివరణలో 

పాఠం బాగున్నది !


కుక్కా బాగున్నది 

పిల్లీ బాగున్నది 

మూగ జీవి స్నేహంలో 

గోవూ బాగున్నది !


చిమ్ముట బాగున్నది 

సర్దుట బాగున్నది 

ఇంటి పనుల సాయంలో 

ఇష్టం బాగున్నది !


విత్తూ బాగున్నది 

మట్టీ బాగున్నది 

తోట పనికి శ్రమదానం 

మొలకై బాగున్నది !


భజనా బాగున్నది 

నాట్యం బాగున్నది 

గుడికి వెళ్లి ప్రార్ధనలో 

భావం బాగున్నది !


సహనం బాగున్నది 

కరుణా బాగున్నది 

దీనుల సేవ చేయుటలో 

దివ్యత బాగున్నది !