మా బడి -బాల గేయం : --- ఎం. వి. ఉమాదేవి 7842368534


 రారండోయ్ బడికెళ్దాం 

జాగ్రత్తలనూ పాటిద్దాం 

ముందుగ ప్రార్థన చెయ్యాలి 

ముచ్చట గేయం పాడాలి!


తరగతి గదిలో నిశ్శబ్దమ్

చాక్ పీస్ డస్టర్ ఇక సిద్ధం!

బోర్డు పై తేది వెయ్యాలి 

చార్టులను తగిలించాలి!


చిత్తుకాగితాలేయొద్దు 

చిల్లరమాటలు అనవద్దు 

ఇంటిపని చేసి తేకుండా 

గోడ కుర్చీలు వేయొద్దు!


ఉపాధ్యాయులు దైవంగా 

ఉన్నతవిద్యా  చదవంగా 

సంఘం శెభాష్ అంటుంది 

చక్కని జీవితముంటుంది !!