వృక్షం-పలుకులు: -ప్రతాప్ కౌటిళ్యా-8309529273


 (కోటీ వృక్షార్చనను పురస్కరించుకుని)

 నేను వృక్షాన్ని-భూమికీ సాక్ష్యాన్ని!

నేను వృక్షాన్ని-భూమిపై మెరిసే నక్షత్రాన్ని !!

పర్యావరణం మా పరివారం

భూమి కీ మేం వరం !?


విశ్వం భూమి నీ సృష్టించి ఉండవచ్చు

భూమి పై ప్రాణవాయువు ను సృష్టించింది మేం!!

మమ్మల్ని కాలుస్తే బొగ్గవుతాం

బ్రతుకనిస్తే బొగ్గు పులుసు వాయువు ను పీల్చుకుంటాం !!


సహజవనరులు సగం కావచ్చు

కానీ మాకు సగ భూభాగం కావాలి !?

వర్గీకరణ కాదు వృక్షరాజ్యం

వృక్ష రాజ్యాంగం

వృక్ష రక్షణ వ్యవస్థ రావాలి!?

మాకు రిజర్వేషన్ కావాలి !?


షెడ్యూల్డ్ కులాల వృక్షాలు

షెడ్యూల్డ్ తెగల చెట్లూ

వెనుకబడిన తరగతుల మొక్కలు

ఫార్వర్డ్ కాస్టుల పారెస్టులు రావాలి!?!?

మనీ నీ మనీ ప్లాంటు నీ కాదు

ఇంటా బయటా ప్లాంట్లను పెంచాలీ !?

ప్లాంటు కాంటీనెంటల్గా మార్చాలీ !?


అడవంటే ఆడపిల్ల లాంటి ది

వనమంటే చంటీపిల్ల లాంటీదీ

తోటంటే తోబుట్టువులాంటీదీ

పంటంటే పడుచు పిల్ల లాంటీద

వృక్ష మంటే కల్పవృక్షం లాంటీదీ 

సాక్షాత్తు అమ్మలాంటీదీ !!!


మమ్మల్ని బ్రతకనిస్తే

మనుషుల్నీ మేం బ్రతికించుకుంటాం !!!!?