నేలను చీల్చుకొనిబయటకు వచ్చేది మొక్క
ఒకటే కాదు
నీటి చుక్క కూడా!!!?
చీకటిని చీల్చుకుని
బయటికి వచ్చేది ది ఉదయం
ఒక్కటే కాదు
హృదయం విచ్చుకుని
బయటకు వచ్చేది
మాట కూడా!!!?
కళ్ళు విచ్చుకుని
చూపునిచ్చే ది
వెలుగు ఒక్కటే కాదు
పెదవి విచ్చుకుని
చిరునవ్వు నిచ్చేది కూడా నువ్వే!?!?
కత్తి కన్నా విత్తనం శక్తివంతమైనది!!
మత్తు కన్నా నిద్దుర గొప్పది !!!
మల్లెపువ్వు ను హత్య చేసిన
ఎర్రని గులాబీ అయింది !!!
దేహానికి చిరునామా ముఖం!!
శబ్దానికి అద్దం శ్రవణం!!!
నడక పెరిగి పరుగు అయినట్లు
పనికి చేతులు రెండు అయినా చాలు
పది వ్రేళ్ళు కాదు
చూపుడు వేలు బొటనవేలు
అదే పదివేలు !!!!?
తల ఒక్కటే కానీ కుడి ఎడమ
గుండె ఒక్కటే కానీ
ఎప్పటికీ ఎడమే!!?
గుండె తల ముందు
తలవంచాల్సిందే నా!!!?
అందం కూడా మానసిక అంశమే!?
పసుపు కుంకుమ చందనం లా
అందం పూస్తే
మసి పూసిన మనుషులు ఉన్నారు
మన గ్రహం లో
నిగ్రహం లేనిది దేహాలకు కాదు
విగ్రహాలకు మాత్రమే !!!?
***గురుతుల్యులు భాగ్య లక్ష్మి గారికి
గులాబీ:-ప్రతాప్ కౌటిళ్యా--8309529273