రవ్వల హారం (బాల గేయం)-ఎడ్ల లక్ష్మి-సిద్దిపేట- సెల్ : 8466850674

 కావు కావు కాకమ్మ

ఎక్కడ నుండి వచ్చావు

రవ్వల హారం తెచ్చావు

ఎవరు నీకు ఇచ్చారు


మేతకు అడవికెళ్ళాను

అక్కడ నాకు దొరికింది

ముక్కు తో పట్టుకొచ్చాను

చెట్టు మీద పెట్టాను


చూడు చూడు చిలకమ్మా

జాతకం నీవు చూడమ్మా

ఎవరి హారమో చెప్పమ్మా

వారికి నేను ఇస్తాను


జాతకం చూసి చిలకమ్మా

అది రాణి హారమన్నాది

చిలుక మాటలిని కాకమ్మా

హారము నోట పట్టుకొని


రివ్వున కాకి ఎగిరింది

రాజుల కోటకు చేరింది

హారము రాణికి ఇచ్చింది

రాణి  మెప్పు పొందింది