వానా వానా రావమ్మా
వసుధ తల్లి పిలుస్తోంది
కొండల్లోన దాగావా
కోనల్లోన దాగావా
దుక్కులు బీట్లు పారెను
అది దుఃఖించ సాగెను
బీడు భూములు చూడమ్మా
ఒక్కసారి నీవు రావమ్మా
వాగులు వంకలు ఎండేను
చెట్టు చేమలు చెదిరేను
చింతకు నీవు రావమ్మా
చినుకు చినుకు కుర్వమ్మా
నేల తల్లిని తడుపమ్మా
భూతల్లి దప్పిక తీర్చమ్మ
పచ్చదనం పెంచమ్మా
ప్రకృతిని మురిపించమ్మా
వాన బాల గేయం:-ఎడ్ల లక్ష్మి--సిద్దిపేట -సెల్ నెంబర్ : 8466850674