తొలకరి జల్లు( బాల గేయం):---ఎడ్ల లక్ష్మి--సిద్దిపేట--సెల్ నెంబర్ : 8466850674
 రోహిణి కార్తీ వచ్చింది 
రోదన చేస్తూ ఉరిమింది
మెరుపులెన్నో మెరిశాయి
తొలకరి జల్లు కురిసింది 
 
నేలతల్లి తడిసింది
ఓడి చాచి కూర్చుంది
రైతెంతో మురిసిసాడు
జోడెడ్లను కట్టాడు 
 
హలము పట్టి దున్నాడు
దుక్కిని చదును చేశాడు
విత్తనాలు చల్లారు
చిన్నగ మొలకెత్తాయి 
 
మా రాకేసి పెరిగాయి
ఫైర్ కలుపు తీశారు
చేనుకెరువులు చల్లారు
వేపుగ చేను ఎదిగింది 
 
పైరు కోతకు వచ్చింది
పంటచేను కోశాడు
ఇంటికి ధాన్యం చేర్చాడు
అందరి ఆకలి తీర్చాడు