అనగనగా ఊరిలోనముసలి అవ్వ వుండెనుఆ అవ్వకు వున్నవి కుంపటి కోడీఅందాల కోడిపుంజుఅరచుచుండె కొక్కొరోయనిఊరిలోని జనమంతాఉలిక్కిపడుచు నిద్రలేచిపనిపాటలకైపోదురుఅవ్వకుంపటిలో అగ్గినిఆడవారు గొనిపోదురుఅన్నమొండ నిప్పుకొరకుసూర్యుడంత ఉదయించునుసుంతయు సమయమునందేఅవ్వకు తోచెను ఇట్టులనాపుంజుా అరవకుంటెసూర్యోదయమేకాదునాకుంపటి లేకుంటేఅగ్గిెట్లా పుట్టు నిచటఅనుకొనుచును ఆ అవ్వాఅందరితో గొడవపడునుగర్వంతో మిడిసిపడుచుఅడవికి పుంజును గొనిపోయెనుకుంపటియూ గొనిపోయెనుకుళ్ళుమోతు ఆ అవ్వఊరిలోన ఉదయమాయెఎప్పటిలా సూర్యుడొచ్చెఊరిలోన అమ్మలునూఉడికించిరి బువ్వలనుగమనించగ అవ్వ వచ్చిగడబిడపడె కాంచినంతనాకోడియు లేకున్ననుతెల్లవారె సూర్యుడొచ్చెనాకుంపటి లేకున్ననుఅమ్మలంత అన్నమొండెఅనుకొనగా ఆ ఆవ్వకుఅణిగిపోయె గర్వమంతఊరివారితో అవ్వ ఉత్సాహంగా కలిసెనుఊరివారు సంతసించిఉన్నతమౌ స్థానమిచ్చెఅవ్వా అని పిలుచుకొంటుఆనందం పంచె ఆమెకుపెద్దదిక్కుగా చూచుచుఘన గౌరవ మొసగెనంతసంతసాన ఆ అవ్వసంబరమెంతో పడెను
కోడి-కుంపటి బాలగేయం:- సత్యవాణి కుంటముక్కుల-8639660566