బాలగేయం: --అయిత అనిత-8985348424జగిత్యాల


 చిట్టి చిట్టి చేతులతో

మొక్కలన్నీ నాటుదాం

బుజ్జి బుజ్జి పిల్లలము

నీళ్లను వాటికి పోద్దాం


బడిలో నాటిన మొక్కలను

భద్రంగా కాపాడుదాం

ఆకులు రెమ్మలు తెంపక

ఏపుగా వాటిని ఎదగనిద్దాం


నీకో మొక్క నాకో మొక్కని

చక్కగ వాటిని పంచుకుందాం

నిత్యం వాటిని పరిశీలిస్తూ

చెలిమిగ వాటిని పెంచుకుందాం


పడగవిప్పిన కాలుష్యమును

కాటికి మనము పంపేద్ధాం

ప్రాణవాయువును పెంచేస్తూ

హాయిగ మనము బతికేద్దాం