బొడ్డెమ్మ బతకమ్మ( బాల గేయం)- మమత ఐల-హైదరాబాద్-9247593432


 దసరా పండగ వచ్చింది

సరదాలెన్నో తెచ్చింది

పూలను కోసుకద్దామ

బొడ్డెమ్మను పూజిద్దామ


తొమ్మిది రకముల పూవులతో

అలంకారము చేద్దాము

రోజుకో రకము నైవేద్యాన్ని

తొమ్మిది రోజులు పెడదాము


బొడ్డెమ్మాటను ఆడుదము

పాట తోనె జోకొట్టెము

కోలాటాలు ఆడెదము

ఉయ్యాల అని పాడెదము


గుంపుగ జేరి పిల్లలందరము

సాంయంకాలపు సమయమున

తొమ్మిది రోజులు ఆడుదము

నిమజ్జ నాన్ని చేయుదము