లెక్కలు(బాల గేయం):-మమత ఐల-హైదరాబాద్9247593432


 అందాల చిలకమ్మ

ఆ..చిలకను చూడమ్మ

జామ చెట్టు మీదుండి

జామ పండు తింటుంది


పండ్లన్ని లెక్కపెట్టి

పలకమీద రాద్దామ

అంకెలను నేర్ధామ

మ్యాస్టారుకు చూపుదామ


ఒకటి, రెండని లెక్కించి

జమచేయుటను నేర్ధామ

పండ్లన్నిటిని జమచేసి

కాయలనన్ని తీద్దామ


పండ్లుఅన్ని ఒకవైపు

కాయలన్ని ఒకవైపు

నేనేమో పండ్ల వైపు

నువ్వేమొ కాయలవైపు


రెండింటిని గుణిద్దాము

గుణకారాన్ని నేర్ధాము

మ్యాస్టారుకు చూపుదాము

బహుమానాలు పొందుదాము