అదిగో చూడండా హద్దుభారత దేశపు సరిహద్దు
అచట వుండేరు సైనికులు
దేశ రక్షణకు జవానులు
వీరులు అంటె వీరేను
మనకు కాపలా కాసేను
వారు పెట్టిన బిక్షవల్లను
హాయిగ మనము బ్రతికేము
అబ్బో వచ్చిరి దుండగులు
దొంగ దెబ్బను తీయుటకు
ఎదురుగ వచ్చే శక్తి లేకను
వెన్ను పోటునే పొడిచారు
అయ్యో! అయ్యో! వీరుల్లారా
భారత దేశపు జవానులారా
మీరుణ మెట్లా తీరేది
ఈబరువు వెట్లా తగ్గేది
చేతులెత్తి మిము మ్రొక్కేము
అశ్రు నివాలులు ఇచ్చేము
జోహార్ జోహార్ జవానులు
భారత దేశపు ముద్దు బిడ్డలు
సైనికులు( బాల గేయం )-మమత ఐల--హైదరాబాద్--9247593432