కాకి పాము:- మమత ఐల--హైదరాబాద్-9247593432


 అనగనగా ఒకచెట్టుంది

చెట్టు కిందఒక పుట్టుంది

పుట్టలొ పెద్ధ నాగుంది

ఎప్పుడు బుసకొడుతుంటుంది


చెట్టు కొమ్మన కాకమ్మ

పెట్టిందక్కడ గూడమ్మ

గూడులొ వున్న గుడ్లన్ని

పాము ఇట్టె పసిగట్టింది


కాకమ్మెప్పుడు పోతుందా

అనిచూస్తుండెను ఈపాము

బుసకొడుతున్న శబ్ధమిని

కాకి కూడపసిగట్టింది


పాము అటువైపు రాకుండ

ముంగీసకు చెప్పెను కాకమ్మ

పాము బైయటకు రాకుండ

కావలిగాసెను ముంగీస


పాముకు తిక్కకుదిరింది

చక్కగ రాజీకచ్చింది

పాముజోలికి కాకివెల్లదు

కాకి జోలికి పామువెల్లదు