తెలుసుకో బాలకా ( బాల గేయం)-మమత ఐల-హైదరాబాద్-9247593432


 అదిగో చూడుము చిన్నోడు

ఆత్మ ధైర్యము కలవాడు

పట్టు వదలని ప్రయత్నమ్ముతో

ఫుట్ బాలును ఎగరేస్తున్నాడు


ఆత్మ బలానికి అడ్డేముందని

బుద్దికి పదనిడుతున్నాడు

చైతన్యానికి శిఖరం నేనని

చెప్పకనే చెబుతున్నాడు


అన్నీ ఉండి ఏదో లేదని

కృంగుట నేర్చిన వారంతా

చూసి నేర్చుట మేలంట


అతిగారాలతొ హద్దులుదాటే

ముద్దు బాలలు మీరంతా

బద్దకాన్ని విడవాలంట


చతురతకన్నా మిన్నేముందని

తెలుసుకుంటిరో ఘనులంట