జామచెట్టుపై చిలకమ్మజామపండ్లను తింటుంది
చిలక కొరికిన జామపడ్లను
తిని చూడగ అతి మథురమట
తీపి పండ్లను ఏరుకొని
తింటుందంట చిలకమ్మ
తీపిని పసిగట్టే గుణము
చిలకమ్మకు మాత్రమె వుంటుంది
చిగురు పచ్చని చిలకమ్మ
కోరితినుటకు రావమ్మ
నీవుతిన్న ఆపడ్లన్ని
మేము కూడ చవిచూస్తాము
శబరి మాతవలె కొరికివ్వు
తీపి పండ్వను అందివ్వు
నీకొరకే చూస్తున్నాము
రివ్వున రావో చిలకమ్మ
చిలకకొరికిన జామపండు( బాల గేయం)- -- మమత ఐల-హైదరాబాద్-9247593432