త్యాగమూర్తులు( బాల గేయం ):మమత ఐల-హైదరాబాద్=9247593432


 బావి పౌరులం మనం మనం

భరత వీరులకు జయం జయం


భారత వీరుల త్యాగఫలం

మనకందరికి మూవధనం


స్వతంత్ర జెండను ఎగరేసి

త్యాగ మూర్తులకు జైకొడదాం


గాంధీ నెహ్రు సుభాష్ గారి

వేశాలన్ని ధరించుదాం


వీరు లందరిని స్మరించుచూ

దేశభక్తిని చాటుదము


దేశ సేవకు మనవంతు

సహకారాన్నందించెదము


దేశ రక్షనే కర్తవ్యముగా

దుర్మార్గాన్ని ఎదిరించెదము


మనమే రేపటి పౌరులము

మనదే మనదే ఈ దేశం