చాచా నెహ్రూ పుట్టినరోజుబాలలమెచ్చిన పండుగ రోజు
బడిలో సందడి ఈరోజు
యెదలో మోదం నిండిన రోజు
గులాబి పూలు ఇష్టమట
పిల్లలు అంటే మక్కువట
బాలలు గులాబి తెచ్చిరట
నెహ్రూ ఎదపై పెట్టిరట
ఎర్ర గులాబీ ఎదపైన
మమతానురాగమే పంచేెను
ప్రథమ ప్రధాని నెహ్రూజీ
బాలలకు చేరువ అయ్యేను
అనురాగ జల్లులే కురిసేను
బాలల మనసులు మురిసేను
స్నేహ బంధమే పెరిగేను
బాలల తోని చాచాకి
చాచా నెహ్రూ( బాల గేయం)--మమత ఐల-హైదరాబాద్==9247593432