కన్నయ్య( బాల గేయం) మమత ఐల-హైదరాబాద్9247593432


 చిన్ని నవ్వుల కృష్ణయ్య

బుడిబుడి నడకల కృష్ణయ్య

యశోదమ్మ నిను కొట్టిందా

మట్టిని ఎందుకు తిన్నావు


అల్లరి ఆటలు ఆడినవా

వెన్నను దొంగిలించావా

కుండలు పగులగొట్టినవా

గొల్లల నేడిపించావా


పక్కింట్లోని పాలు పెరుగు

దోస్తులందరికి పంచినవా

అమ్మ అందుకని కొట్టిందా

రోలుకు నిను కట్టేసిందా


చూడచక్కని రూపమయ

ఆటలలో నువు మేటివయ

అందమైన ఓకృష్ణయ్య

యిలలో దైవం నీవయ్య