అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం(బాలగేయం):-మమత ఐల-హైదరాబాద్-9247593432


 అమ్మ ఒడినుండి నేర్చిన భాష

తల్లి పాలవలె కమ్మని భాష

తెలుగుజాతి గర్వించెడి భాష

మక్కువ కలిగిన మాతృభాష


దేవరాయలు మెచ్చిన భాష

లెస్సగతీర్పు లిచ్చినభాష

ప్రభందాలు పలికించిన భాష

వినసొంపైనది మాతృభాష


సంస్కృతిలోన చక్కనిభాష

వేమన నీతికి చిక్కిన భాష

నాభినుండి మొలకెత్తిన భాష

ధ్వనిలో అమృతమీభాష


తెలుగు తేజమై వెలిగేభాష

స్వచ్ఛమైనది ఈ భాష

దేశభాషలో ముత్యమైనది

తేటతెలుగు ఈ మాతృభాష