తొక్కుడుబిల్ల( మమత ఐల--హైదరాబాద్--9247593432బాల గేయం )

 సీత గీత మనమంత 
తొక్కుడు బిల్ల ఆడుదమ
గీతలు గీసి బిల్లనువేసి
ఒంటి కాలుతో ఎగురుదమ
నాటి తరాల ఈఆట
నేటి పిల్లలం మనమంత
ఆట మరుగున పడకుండ
అందరమాడుదమీ ఆట
నీకొకబిల్ల నాకొక బిల్ల
బిల్లను తీసి డబ్బలవేసి
ఒంటి కాలుతో గెంటుతు వెల్లి
బిల్ల మీద అడుగేయాలి
బాతమీద అడుగేసావా
ఔటైతావు జాగ్రత్త
ఏడబ్బల నీబిల్ల వుండెనో
ఆ డబ్బ వరకు నువు వెల్లాలి
ఒంటి కాలుతో అదికూడ
బాగుంది కద ఈఆట