ఎండకాలపు జాగ్రత్తలు( బాల గేయం )--మమత ఐల-హైదరాబాద్-9247593432


 ఇంటి లోపలికి వడగాడ్పు

రాకుండ జేయుటకు ఈమార్పు

కిటికీలకు దర్వాజలకు

తడిజేసిన కర్టెన్ కట్టాలి


బయటనుండి వచ్చేగాలి

కర్టెన్లకు తాకిన ప్రతిసారి

వేడిని అంత తడిగుడ్డ తీసుకొని

చల్లటి గాలిని మనకిచ్చు


ఐసు ముక్కలను తినవద్దు

చల్లటి మజ్జిగ తాగాలి

నిమ్మకాయలో రసమును తీసి

గ్లాసెడు నీటిలొ కలపాలి


తేనె గాని ఉప్పైనా గాని

కలుపు కోని అవి తాగాలి

శరీరంలోని లవనములు

పెంపొందించును అవి మనకు