అమ్మ ఎలకల గడబెడను
చూడ లేకపోతున్నాను
పిల్లిని తెచ్చి పెంచెదమ
ఎలకలను పట్టిచ్చెదమ
మియావ్ ,మియావ్ మనిఅంటుంది
ఎలకలను తరిమేస్తుంది
రవితెచ్చాడు ఒకపిల్లి
ఎలకల కొరకు తానెల్లి
అయ్యో! పిల్లి హాయిగను
ఇంటిన వున్న పాలు,పెరుగును
కమ్మగ తాగుతు వుంటుంది
హాయిగ బజ్జోనుంటుంది
ఎలకల గడబిడ కంటేను
పిల్లి గడబిడ ఎక్కువాయెను
గోటితో పోయె సమస్యనే
గొడ్డలి పెట్టుగ మారేను
ఎలకలబెడద( బాల గేయం ) - మమత ఐల--హైదరాబాద్-9247593432