పచ్చని పైరుల పంట కోసముకష్టించెడి ఓ రైతన్న
రేయి పగలును లెక్కచేయక
చెమటచుక్కలను చిందించి
నాగలి పట్టి దుక్కిని దున్ని
విత్తనాలను చల్లేవు
చినుకు కోసము తపించి పోయి
దైవానికి దండం పెట్టేవు
చినుకు జల్లులు చిందులేయగ
సంబరాన్ని చూపించేవు
బంగరు పంటను పండించి
అందరి ఆకలి తీర్చేవు
అన్న ధాతవు నీవన్న
ఆకలి తీర్చే రైతన్న
నీ కష్ట మైనశ్రమ లేకుంటె
దేశం బ్రతికేదెట్లన్న
అందుకనే ఓ రైతన్న
వందన మిడుదును నీకన్న
రైతు: -మమత ఐల-హైదరాబాద్-9247593432